సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.!
- July 26, 2023
వర్షాకాలం వచ్చిందంటే సైనస్ మరింత విజృంభిస్తుంది. ఆ మాటకొస్తే, వాతావరణంలో ఏ మార్పు వచ్చినా సైనస్ సమస్య వున్న వాళ్లు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంతేకాదు, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లూ, వైరల్ ఇన్‌పెక్షన్లు కూడా సైనస్ వ్యాధి గ్రస్తుల్ని మరింత ఇబ్బందికి గురి చేస్తుంటాయ్.
సైనస్ కారణంగా రెండు ముక్కులు దిబ్బడ వేసి, శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. దాంతో పాటూ, ముఖం ఉబ్బరంగా వుండడం, భరించలేని తలనొప్పి.. తదితర సమస్యలు వేధిస్తుంటాయ్.
ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి మందులు ఎన్ని వున్నా అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. యోగాతో సైనస్‌కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
కొన్ని యోగాసనాలు ముక్కులోని గాలి రంధ్రాలను తెరిచి సైనసైటిస్ లక్షణాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయ్. అలాగే ఊపిరితిత్తుల్ని విస్తరించడంలోనూ యోగా తోడ్పడుతుంది. ఆక్సిజన్ తీసుకునే సామర్ధ్యాన్ని పెంచుతాయ్.
ముఖ్యంగా యోగాలో భుజంగాసనం సైనస్ సమస్యను దూరం చేసేందుకు ఎక్కువ షహాయపడుతుందని చెబుతున్నారు. ఛాతీ, ఊపిరితిత్తులను విస్తరించేలా చేసి గుండెకూ బలాన్ని చేకూరుస్తుంది ఈ ఆసనం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







