ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ 2023 టూర్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం

- July 27, 2023 , by Maagulf
ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ 2023 టూర్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం

కువైట్:  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ 2023 టూర్‌ని కువైట్‌లో నిర్వహించేందుకు కువైట్ క్రికెట్ (కేసీసీ) రిజిస్ట్రేషన్ ను ప్రారంభించింది. సులైబియా క్రికెట్ గ్రౌండ్‌లో ఆగస్టు 10,  11 తేదీల్లో ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదర్శించనున్నారు. క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్‌ను మొదటిసారిగా నిర్వహించడం పట్ల కేసీసీ ప్రెసిడెంట్ మిస్టర్ హైదర్ ఫర్మా హర్షం వ్యక్తం చేశారు. కువైట్ కు అవకాశాన్ని ఇచ్చిన ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అవకాశం కువైట్ రాష్ట్రంలోని క్రికెట్ క్రీడను ప్రొత్సహిస్తుందన్నారు.

ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా కువైట్, బహ్రెయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆతిథ్య దేశం భారతదేశంతో సహా 18 దేశాలకు వెళ్లనుంది. 2019 నుండి మొదటి పూర్తి స్థాయి ట్రోఫీ టూర్, 2023 ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించనుంది.    ప్రపంచ కప్‌తో ఫోటో తీసుకోవడానికి, ఉచిత ప్రవేశం కోసం  https://www.indiansinkuwait.com/campaign/worldcup/ లో పేర్లను నమోదు చేసుకోవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com