‘భోళా శంకర్’ హిట్టు పక్కా బాస్.!
- July 27, 2023
‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ఇటీవల రికార్డులు కొల్లగొట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు ‘భోళా శంకర్’ అంటూ వస్తున్నారు. ఆగస్టు 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు ఒక్కొక్కటిగా దుమ్ము దులిపేస్తున్నాయనే చెప్పాలి. నిన్న, మొన్న వచ్చని ఆడియో సింగిల్స్‌తోనే చిరంజీవి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారనుకుంటే, తాజాగా వచ్చిన ట్రైలర్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’కు సీక్వెల్ చూసినట్లుగా వుందంటూ ‘భోళా శంకర్’ ట్రైలర్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
ఆ రేంజ్లో అన్ని రకాల కమర్షియల్ యాంగిల్స్నీ పుష్కలంగా నింపేశారు ఈ సినిమాలో. వాస్తవానికి ఒరిజినల్లో ఇంత ఎంటర్టైన్మెంట్ వుండదు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా తెలుగులో మెహర్ రమేష్ చేసిన మార్పులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయనడం అతిశయోక్తి కాదని ట్రైలర్ చూసి ఫిక్సయిపోయారు మెగా ఫ్యాన్స్.
కేవలం సోల్ మాత్రమే తీసుకుని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా, చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అందుకు తగ్గట్టుగానే ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంకేముంది మరో బ్లాక్ బాస్టర్ మెగా ప్యాన్స్ కిచ్చేందుకు చిరంజీవి రెడీ అయిపోయారంతే.!
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







