పెట్టుబడుల విస్తరణకు PIF, OIA అవగాహన ఒప్పందం
- July 28, 2023
రియాద్: ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఒఐఎ)తో అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసినట్లు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పిఐఎఫ్) ప్రకటించింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (ఒమన్) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కొత్త పెట్టుబడుల విస్తరణకు ఇది ఉద్దేశించిందని తెలిపింది. ఒమన్‌లో పెట్టుబడి అవకాశాలను అన్‌లాక్ చేయడానికి ఉద్దేశించిన PIF మరియు దాని పోర్ట్‌ఫోలియో కంపెనీలకు ఎమ్ఒయు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఒమన్‌లోని ఆశాజనక రంగాలలో సౌదీ ఒమానీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (SOIC) పెట్టిన పెట్టుబడులు USD5 బిలియన్లకు చేరుకుంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒమానీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు మరియు సహకారాన్ని విస్తరించడానికి PIF మరియు OIA మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ అవగాహనా ఒప్పందం ఒక ముఖ్యమైన దశ అని పిఐఎఫ్లో డిప్యూటీ గవర్నర్ మరియు మెనా ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ యజీద్ ఎ. అల్-హుమీద్ వెల్లడించారు. ఇది సౌదీ అరేబియా, ఒమన్లలో ఆర్థిక వైవిధ్యతను పెంచడానికి మరింత సహకారాన్ని అందిస్తుందని, ఒమన్ 2040 విజన్ ద్వారా సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌కు ఎఫ్‌డిఐని ఆకర్షించడానికి OIA చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా, రెండు దేశాలలో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్య అవకాశాలను సులభతరం చేయడం దీని లక్ష్యం అని OIAలో ఇన్వెస్ట్మెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్ ముల్హెమ్ బషీర్ అల్ జార్ఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







