ఏం చేసినా చుండ్రు సమస్య తీరడం లేదా.?

- July 29, 2023 , by Maagulf
ఏం చేసినా చుండ్రు సమస్య తీరడం లేదా.?

డేండ్రఫ్ కారణంగా నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓ మాదిరి చుండ్రు సమస్య వుంటే ఫర్వాలేదు కానీ, విపరీతంగా చుండ్రు సమస్య వేధిస్తుంటే, దాన్ని అస్సలు లైట్ తీసుకోకూడదు. 

ఫంగల్ ఇన్ఫెక్షన్‌గా చెప్పబడే చుండ్రు బాధకు శాశ్వత పరిష్కారం ఫలానా అని చెప్పలేం కానీ, ఇంటి చిట్కాలను క్రమం తప్పకుండా వాడితే, చుండ్రు సమస్య నుంచి కొంత వరకూ ఉపశమనం పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వేపాకు పేస్ట్, నిమ్మరసం, పుదీనా పేస్ట్ ఇలా ఏది అందుబాటులో వుంటే దాన్ని పేస్ట్‌లా చేసి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని వారాల్లో చుండ్రు సమస్య తీరిపోతుంది.

బాగా ఎక్కువ సమస్య వుంటే, పెరుగులో ఉసిరి కాయ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని అరగంట సేపు తలకు బాగా పట్టించి తల స్నానం చేస్తే మంచి ఉపశమనం వుంటుంది.
 
మెంతులు కూడా చుండ్రును తగ్గించడంలో బాగా సహాయపడతాయ్. కలబంద గుజ్జుని కూడా వాడొచ్చు. ఏది వాడినా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు పాటిస్తేనే పలితం వుంటుందనేది నిపుణుల సలహా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com