గురూజీ దృష్టిలో పడిన ‘బ్రో’ భామ.!
- July 29, 2023
‘రొమాంటిక్’ సినిమాతో సినిమాలకు పరిచయమైన ముద్దుగుమ్మ కేతిక శర్మ. డబ్ స్మాషర్‌గా సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వున్న కేతిక శర్మకు పూరీ జగన్నాధ్ ‘రొమాంటిక్’ సినిమాలో ఛాన్సిచ్చాడు.
ఆ తర్వాత అలా అలా సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ, ఒకానొక టైమ్‌లో కేతిక కెరీర్ వేస్ట్ అయిపోయిందనుకున్నారంతా.
అయితే, ఎవరి అదృష్టం ఎప్పుడు.? ఎలా.? తిరుగుతుందో తెలీదు కదా.. ‘బ్రో’ రూపంలో కేతికకు టైమొచ్చింది. నిజానికి ఈ సినిమాలో కేతికకు పెద్ద ఇంపార్టెన్స్ లేకపోయినప్పటికీ, ఈ సినిమాకి బ్యాక్ బోన్‌లా వ్యహరించిన త్రివిక్రమ్ దృష్టిలో కేతిక పడడం విశేషం.
అన్ని రకాలా కేతిక టాలెంట్ గుర్తించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, తదుపరి సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడట. త్రివిక్రమ్ శ్రినివాస్ సినిమాలన్నీ బడా మూవీసే వుంటాయ్ దాదాపుగా.
ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా కోసం ఆల్రెడీ హీరోయిన్లు సెట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక, ఆ తరువాతి సినిమా అంటే అల్లు అర్జున్‌తో వుండొచ్చు. సో, ఆ సినిమాలోనే కేతికకు ఛాన్సిచ్చేస్తాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







