వారంలో SR10 బిలియన్ల పీఓఎస్ లావాదేవీలు

- July 29, 2023 , by Maagulf
వారంలో SR10 బిలియన్ల పీఓఎస్ లావాదేవీలు

రియాద్: సౌదీ అరేబియాలోని ప్రజలు జూలై 16-22 మధ్య 159,618,000  POS లావాదేవీల ద్వారా SR10,120,926,000 వరకు ఖర్చు చేశారు. మునుపటి వారంలో SR10,919,162,000తో పోలిస్తే పెరుగుదల నమోదైంది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ వీక్లీ బులెటిన్ ఫర్ పాయింట్స్ ఆఫ్ సేల్ ప్రకారం.. రెస్టారెంట్లు మరియు కేఫ్‌ల రంగం 46,387,000 లావాదేవీలతో SR1,579,839,000 విలువతో అగ్రస్థానంలో ఉండగా, విద్యా రంగం అత్యల్పంగా 77,000 లావాదేవీలతో SR81,678,000 విలువతో నిలిచింది. ఇతర రంగాల విషయానికొస్తే, దుస్తులు - పాదరక్షల లావాదేవీల సంఖ్య 4,310,000 SR561,133,000 విలువతో ఉంది.  అయితే వారంలో నిర్మాణ-నిర్మాణ సామగ్రికి సంబంధించిన లావాదేవీల సంఖ్య 1,242,000 లావాదేవీలు, విలువ SR321,589,000గా నమోదైంది. ఎలక్ట్రానిక్- ఎలక్ట్రిక్ పరికరాలలో లావాదేవీల సంఖ్య SR208,532,000 విలువతో 940,000కి చేరుకుంది.అయితే గ్యాస్ స్టేషన్‌లలో లావాదేవీల సంఖ్య SR665,915,000 విలువతో 12,418,000కి నిలిచింది. హెల్త్ సెక్టర్ లావాదేవీల సంఖ్య 6,572,000 SR672,303,000 విలువతో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అయితే పబ్లిక్ యుటిలిటీలలో లావాదేవీల సంఖ్య SR99,376,000 విలువతో 1,365,000కి చేరుకుంది. SR176,609,000 విలువతో ఆభరణాలలో లావాదేవీల సంఖ్య 190,000తో నిలిచింది. SR74,515,000 విలువతో టెలికమ్యూనికేషన్స్ రంగంలో లావాదేవీల సంఖ్య 547,000కి చేరుకుంది.

సౌదీ అరేబియాలోని నగరాల్లో చూస్తే.. రియాద్ SR3,237,785,000 విలువతో అత్యధికంగా 46,618,000 వారపు POS లావాదేవీలతో నిలిచింది.  అయితే అభా SR206,745,000 విలువతో 3,633,000 లావాదేవీలతో అత్యల్ప సంఖ్యను నమోదు చేసింది. మక్కాలో POS లావాదేవీల సంఖ్య SR382,247,000 విలువతో 6,384,000కి చేరుకోగా, మదీనాలో POS లావాదేవీల సంఖ్య SR383,270,000 విలువతో 6,586,000కి చేరుకుంది. తబుక్‌లో POS లావాదేవీల సంఖ్య SR167,772,000 విలువతో 3,159,000కి చేరుకుంది.  హైల్‌లో SR163,745,000 విలువతో 2,891,000 లావాదేవీలు జరిగాయి. బురైదాలో POS లావాదేవీల సంఖ్య SR241,241,000 విలువతో 3,699,000, మరియు అల్ ఖోబర్‌లో 3,356,00 లావాదేవాలతో SR278,716,000 విలువైన లావాదేవీలు జరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com