ఆన్‌లైన్ బుకింగ్ ఛానెల్‌లలో కార్గో రియల్ టైమ్ ధరల ప్రదర్శన

- July 30, 2023 , by Maagulf
ఆన్‌లైన్ బుకింగ్ ఛానెల్‌లలో కార్గో రియల్ టైమ్ ధరల ప్రదర్శన

దోహా: ఎయిర్ కార్గో రవాణాలో గ్లోబల్ లీడర్ అయిన ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో.. PROS స్మార్ట్ ప్రైస్ ఆప్టిమైజేషన్. మేనేజ్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నెట్‌వర్క్‌లోని అన్ని ఆన్‌లైన్ బుకింగ్ ఛానెల్‌లలో రియల్ టైమ్ ధరలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఖతార్ కార్గో కస్టమర్‌లకు మెరుగైన డిజిటల్ కొనుగోలు అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఖతార్ యొక్క విమానయాన రంగం అత్యాధునిక సాంకేతికతలతో వేగాన్ని కొనసాగిస్తుందని పేర్కొంది. PROS ఎయిర్ కార్గో ఆర్కెస్ట్రేషన్ సేవలు WebCargo, CargoAI, Cargo.one వంటి థర్డ్-పార్టీ డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లలో కూడా అందుబాటులో ఉంటుందని ట్రావెల్, PROS అధ్యక్షుడు సురైన్ అద్యంతయ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com