మాస్కో ఎయిర్‌పోర్ట్ పై దాడి.. వణికిపోయిన ప్రయాణికులు
- July 30, 2023
రష్యా భూభాగంపై మరోసారి దాడి జరిగడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కెర్చ్ వంతెన పై దాడి ఘటనను మరచిపోకముందే మరోసారి రష్యా ప్రధాన భూభాగంపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ పని చేసింది ఉక్రెయినే అని రష్యా ఎప్పటిలానే ఆరోపించింది. కానీ ఉక్రెయిన్ సరిహద్దుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కో పై ఉక్రెయిన్ దాడి చేయడం రష్యా భద్రతా నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి.
రష్యా రాజధాని మాస్కో పై డ్రోన్లు విరుచుకుపడ్డాయి. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ ఒక డ్రోన్‌ను కూల్చివేసిందని పేర్కొంది. ఈ దాడిలో విమానాశ్రయానికి చెందిన రెండు భవనాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. మొత్తం మూడ డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయని, ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ఉందని మాస్కో ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా అభివర్ణించింది. జులై 30వ తేదీ ఉదయం కీవ్ పాలకులు మానవ రహిత విమానంతో ఉగ్ర దాడికి యత్నించారని.. ఆ దానిని తాము భగ్నం చేశామని రష్యా ప్రకటించింది. ఒక ఉక్రెయిన్ డ్రోన్‌ను కూల్చేశామని, మరో రెండు డ్రోన్లు కూడా తమ ఎలక్ట్రానిక్ వార్ఫెర్ వ్యవస్థ దెబ్బకు నియంత్రణ కోల్పోయి రెండు భవనాలపై కూలిపోయాయని మాస్కో రక్షణశాఖ వెల్లడించింది. రెండు ఆఫీస్ టవర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని రష్యా మేయర్ సెర్గీ సోబియన్ పేర్కొన్నారు. మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్‌లు దాడి చేశాయని, ఎటువంటి ప్రాణనష్టం లేదని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. డ్రోన్ దాడి కారణంగా భవనం మొదటి నుంచి నాలుగో అంతస్తు వరకు గాజు ఫలక పగిలిపోయిందని వెల్లడించారు.
సరిహద్దులకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని మాస్కోపై డ్రోన్ దాడి జరగడం ఆదేశ సైన్యాన్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ దాడిలో ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసివేశారు. ఇక్కడికి వచ్చే విమానాలను దారి మళ్లించినట్లు పేర్కొంది. దాదాపు గంట తర్వాత ఇక్కడ రాకపోకలను పునరుద్ధరించారు. ఉక్రెయిన్ అమ్ములపొదిలోని పడవ డ్రోన్లు రష్యాను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇటీవల క్రిమియాను రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్ వంతెన వద్ద కూడా భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఇప్పటికే గతేడాది ఓ సారి ఈ వంతెనపై భారీ దాడి జరగడంతో రష్యా ఇక్కడ భద్రతను గణనీయంగా పెంచింది. అయినా.. దీనిపై తాజాగా దాడి జరిగింది. పేలుడు తీవ్రతకు వంతెనలోని ఓ వైపు భాగం కుంగిపోయింది. ఫలితంగా ఇక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
తాజా వార్తలు
- 'ది గేమ్‌చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్‌కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్‌లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?







