సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ఖండించిన బెనిఫిట్
- July 30, 2023
బహ్రెయిన్: "బెనిఫిట్ బి" అప్లికేషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అసత్య వార్తలను బెనిఫిట్ కంపెనీ తోసిపుచ్చింది. ఈ మేరకు వారి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ క్లెయిమ్‌లు పూర్తిగా అవాస్తవమని కంపెనీ అందులో స్పష్టం చేసింది. అప్లికేషన్ భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారు గుర్తింపులను క్షుణ్ణంగా ధృవీకరిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా, కంపెనీ మోసపూరిత కాల్లకు సంబంధించి మరోసారి హెచ్చరించింది. రహస్య కోడ్లను అభ్యర్థించడానికి లేదా లింక్‌లను కలిగి ఉన్న మెసేజ్ లను నమ్మవద్దని, తాము ఎప్పుడు అలా కోరమని స్పష్టం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ధృవీకరించని వార్తలు మరియు పుకార్లను ప్రచారం చేయవద్దని కోరారు. సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు దాని ప్రామాణికతను ధృవీకరించుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







