విమానం ఢీకొని ఇద్దరు దుబాయ్ వాసులు మృతి..!
- July 30, 2023
యూఏఈ: జులై 28న ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని కాబూల్చర్ ఎయిర్‌ఫీల్డ్‌పై విమానం ఢీకొన్న ప్రమాదంలో ప్రతిష్టాత్మకమైన యోగా శిక్షకురాలు, ప్రఖ్యాత రచయిత్రి జాన్ మాడెర్న్, ఆమె భర్త డేవిడ్ మాడెర్న్ మరణించారు. గతంలో వీరు దుబాయ్ లో నివసించారు. దీంతో దుబాయ్ లోని నివాసితులు వారికి సంతాపం తెలిపారు. ముఖ్యంగా జాన్ యోగా తరగతులు మరియు ఫిట్నెస్ పుస్తకాలు చాలా మంది జీవితాలను మార్చాయని గుర్తుచేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు నివాసితులు నివాళులు అర్పిస్తున్నారు. "ఈ విషాద వార్త వినడానికి చాలా బాధగా ఉంది. వారు చాలా ఏళ్లుగా తెలుసు. వారు చాలా సున్నితమైన, మంచి వ్యక్తులు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి" అని ఒక నివాసి ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసారు. ఆస్ట్రేలియా స్థానిక మీడియా సంస్థల ప్రకారం, ఒక విమానం టేకాఫ్ , మరొకటి ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







