నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ
- July 31, 2023
హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గొవర్ధన్, షకీల్ కూడా పాల్గొన్నారు.
కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణ లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నాడు కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ ను సందర్శించనున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3 వేల మంది పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... ఐటీ హబ్ లో కంపెనీని ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగావకాలు కల్పించాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ దార్శనికతకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఐటీ హబ్ లో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో నిజామాబాద్ లో మరిన్ని కంపెనీలు ఏర్పాటు అవుతాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కవిత కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గుప్తా కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







