విమానంలో కొండచిలువలు తెచ్చిన ప్రయాణికుడు
- July 31, 2023
కౌలాలంపూర్: కౌలాలంపూర్ నుంచి ట్రాలీ బ్యాగుల్లో కొండచిలువలు, బల్లులు తీసుకువచ్చిన ఘటన తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగుచూసింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్ నుంచి 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహమ్మద్ మొయిదీన్ అనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
మహమ్మద్ మొయిదీన్ బాటిక్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు మొయిదీన్ ను అడ్డుకున్నారు. తిరుచ్చి విమానాశ్రయం అతని ట్రాలీ బ్యాగులు విప్పి చూడగానే అందులో కొండచిలువలు దర్శనమివ్వడంతో కస్టమ్స్ అధికారులు షాక్ కు గురయ్యారు.
అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం కొండచిలువలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. విచారణ నిమిత్తం మొయిదీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







