వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపితే భారీ జరిమానా, జైలు శిక్ష
- August 01, 2023
సౌదీ అరేబియా: మన ఫీలింగ్స్, అభిప్రాయాలను, సంకేతాలను ఎమోజీల రూపంలో పంపించే ట్రెండ్ సౌదీ అరేబియాలో సాగదు. ఏదైనా చెప్పాలన్నా, రియాక్ట్ అవ్వాలన్నా ఎమోజీలను తెగ వాడేస్తుంటాం. కానీ సౌదీ అరేబియాలో అలా కుదరదు. వాట్సాప్ లో ఎమెజీలతో అభిప్రాయాలను..ఫీలింగ్స్ ను తెలుపుతుంటాం. అదే ప్రేమను తెలియజేయాలంటే ‘హార్ట్’సింబల్ సెండ్ చేస్తే సరిపోతుంది..దానికి మాటలు పదాలు టైమ్ చేయనవసరంలేదు. హార్ట్ ఎమోజీలతో ఇంప్రెస్ చేయటం పరిపాటిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ప్రేమికులకు. కానీ ఆ ‘హార్ట్ ఎమోజీ’ పంపిస్తే భారీ జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందట.
వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, 100,000 సౌదీ అరేబియా రియాల్స్ జరిమానా విధిస్తామంటు ప్రకటించింది. అవతలి వ్యక్తి ఇష్టమైతే కాస్త ఓకే..కానీ ఇష్టం లేకుండా పంపిస్తే మాత్రం తప్పదు జరిమానా…అదే మరోసారి చేస్తే జరిమానా ఇంకా పెరుగుతుంది. ఒక్కోసారి జైలుశిక్ష కూడా పడవచ్చు. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
చేసిందే మరోసారి చేస్తే 100,000 సౌదీ అరేబియా రియాల్స్ జరిమానా కాస్త 300,000 సౌదీ అరేబియా రియాల్స్ కు పెరుగుతుంది.అంతేకాదు ఐదేళ్ల శిక్ష విధిస్తామని సౌదీ అరేబియాకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా వెల్లడించారు.
అసలే కఠినాతి కఠినమైన ఆంక్షలు ఉండే సౌదీ అరేబియా దేశంలో ఇది తాజాగా వచ్చిన మరొకటిగా చేరింది. ఈ కొత్త వార్నింగ్ తో జనాలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే. లేదంటే జేబులే కాదు బ్యాంక్ బాలెన్స్ కూడా ఖాళీ అయిపోతుంది. కాగా సోషల్ మీడియా వాడకాన్ని మరింత సేఫ్‌గా మార్చేందుకు సౌదీ ప్రభుత్వం ఈ కొత్త రూల్ అని వివరించారు మోతాజ్ కుత్బీ.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







