2024 ఒలింపిక్స్‌ జ్యోతి నమూనా ఆవిష్కరణ

- August 01, 2023 , by Maagulf
2024 ఒలింపిక్స్‌ జ్యోతి నమూనా ఆవిష్కరణ

ఫ్రాన్స్: 2024 పారిస్‌ ఒలింపిక్స్‌, పారా ఒంపిక్స్‌ జ్యోతి నమూనాను మంగళవారం ఆవిష్కరించారు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ను పోలిన ఈ టార్చ్‌ నమూనాను ప్రఖ్యాత డిజైనర్‌ మాథ్యూ లెహెన్నూర్‌ రూపొందించారు. 2024 ఒలింపిక్స్‌ జరిగేందుకు సరిగ్గా ఏడాది ఉన్న నేపథ్యంలో ఈ జ్యోతి నమూనాను పారిస్‌ అధ్యక్షుడు టోనీ ఎస్టాంగ్వెస్ట్‌ అందజేశారు. ఇది 70 సెంటీమీటర్ల ఎత్తుతో తేలికపాటి రేడియంట్‌ స్టీల్‌తో తయారు చేయబడి, షాంఫైన్‌ రంగుతో విభిన్నంగా ఉందని, అలాగే దిగువభాగంలో సెయిన్‌ నది కదలికలను అనుకరించే ఉపశమన నమూనా కలిగి ఉన్నట్లు తెలిపారు. ఈసారి ఒలింపిక్స్‌లో ఎక్కువమంది మహిళలు ఎక్కువమంది పాల్గొనాలన్నదే తమ ధ్యేయమని, పారిస్‌ ఒలింపిక్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసి చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని అధ్యక్షుడు టోనీ ఎస్టాంగ్వెస్ట్‌ అన్నారు. ఇక టార్చ్‌ రూపకర్త మాథ్యూ లెహెన్నూర్‌ మాట్లాడుతూ.. తాను మూడు పారిస్‌ ఒలింపిక్‌ క్రీడల చిహ్నాలను తయారుచేశానని, పారా ఒలింపిక్స్‌ క్రీడలను ఒలింపిక్స్‌ తరహాలోనే నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే ఒకే టార్చ్‌ను రూపొందించానన్నారు. 2024 ఏప్రిల్‌ 16న గ్రీస్‌లో ఒలింపియాడ్‌లో సూర్యకిరణాలద్వారా జ్యోతిని వెలిగించబడుతుందని, ఐదు ఖండాల్లో తిరిగి 64 ఫ్రెంచ్‌ భూభాగాల గుండా ప్రయాణించి మే 8న మధ్యధరా సముద్రం దాటి ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌కు చేరుతుందన్నారు. మొత్తం 10వేలమంది టార్చ్‌ బేరర్లు దీనిని మోయనున్నట్లు ఆతిథ్య దేశంలోని ప్రసిద్ధ, చారిత్రాత్మక ప్రదేశాలలోనూ ఈ టార్చ్‌ రిలే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక పారిస్‌ ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ప్రకారం జులై 26, 2024 నుంచి ఆగస్టు 11వరకు, పారా ఒలింపిక్స్‌ క్రీడలు ఆగస్టు 28, 2024 నుంచి సెప్టెంబర్‌ 8వరకు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com