ఏపీ పోలీస్ అలవెన్స్ ల్లో కోత..
- August 02, 2023
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అలవెన్స్ ల్లో కోత విధించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం 79ని విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ సిబ్బందికి అంతకముందు కేటాయించిన 30 శాతం అలవెన్స్ ను పూర్తిగా తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్(ఏ.ఎన్.ఎస్) సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ ను కూడా పూర్తిగా తొలిగించింది. డిప్యూటేషన్ పై ఏసీబీలో పని చేస్తున్న వారి అలవెన్స్ 30 నుండి 25 శాతానికి కుదించింది.
అలాగే ఏసీబీలో నేరుగా రిక్రూట్ అయిన వారి అలవెన్స్ 10 నుంచి 8 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు అడిషినల్ హెచ్ఆర్ఏ సైతం తొలగించింది. కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ కూడా ఎత్తివేసింది.
గత నెల(జులై)12వ తేదీన అలవెన్సులలో కోత విధిస్తూ జీవో నెంబర్ 79ని జారీ చేసింది. జీవోకు అనుకూలంగా ఉన్నట్లు ప్రభుత్వానికి డీజీపీ కార్యాలయం కన్సెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ అలవెన్స్ ల్లో కోతలు మొదలయ్యాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







