బాలీవుడ్ స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య..
- August 02, 2023
ముంబై: ఇటీవల పలువురు సినీ ప్రముఖులు అకస్మాత్తుగా మరణించి పరిశ్రమలో విషాదం నింపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకొని మరణించడం బాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన నితిన్ దేశాయ్ నేడు తెల్లవారుజామున ముంబైలో ఉన్న తన ND స్టూడియోలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది.
1980లలో సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ దేశాయ్ 1989లో పరిందా సినిమాతో ఆర్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి దాదాపు 100 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా, మరో 50 సినిమాలకు పైగా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు. నటుడిగా కూడా పలు సినిమాల్లో మెరిపించారు. దర్శకుడిగానూ రెండు సినిమాలు తెరకెక్కించారు నితిన్ దేశాయ్. నిర్మాతగా కూడా రెండు సినిమాలు తెరకెక్కించారు.
హమ్ దిల్ దే సనమ్, లగాన్, దేవదాస్, జోధా అక్బర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, 1942 ఏ లవ్ స్టోరీ, ఫ్యాషన్, పాని పట్, దోస్తానా.. లాంటి ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలకు పనిచేసారు నితిన్ దేశాయ్. అనేక అవార్డులు కూడా అందుకున్నారు. అయితే కరోనా తర్వాత నుంచి ఆయన చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. స్టార్ హోదాలో ఉన్న ఆయన ఇలా 57 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్స్ నితిన్ దేశాయ్ మృతిపై దిగ్బ్రాంతి చెంది నివాళులు అర్పిస్తున్నారు..
ఆత్మహత్య కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దానిపై కారణాలు ఇంకా తెలియలేదు. అయితే అప్పుల బాధతో, ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని పలువురు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







