తెలంగాణ అసెంబ్లీ వద్ద 144 సెక్షన్ అమలు
- August 03, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ వద్ద 144 సెక్షన్ ను అమలు పరిచారు. అసెంబ్లీ చుట్టూ 4 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, గుంపులుగా వెళ్లడంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. సమావేశాలు ముగిసే వరకు ఆంక్షలు ఉంటాయని… అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలు కావడం తో సమావేశాల ఫై అందరిలో ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అధికార బీఆర్ఎస్తో పాటు విపక్షాలైన కాంగ్రెస్, భాజపాలు కూడా కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఈసారి సభాపర్వంలో కూడా ఆ వేడి, వాడి కనిపించనుందని తెలుస్తోంది. ఆర్టీసీ విలీన బిల్లు, గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవల మంత్రివర్గం ఆమోదించగా.. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను కూడా తిరిగి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లులపై చర్చించి, వీటి ప్రాముఖ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







