అధికారిక పర్యటన కోసం జోర్డాన్ చేరుకున్న షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- August 03, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. జోర్డాన్‌లోని హషెమైట్ కింగ్డమ్కు అధికారిక పర్యటన కోసం అమ్మన్ చేరుకున్నారు. మార్కా అంతర్జాతీయ విమానాశ్రయంలో యూఏఈ పాలకుడికి జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ , జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ ప్రిన్స్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II స్వాగతం పలికారు. అనంతరం షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ కోసం అధికారిక రిసెప్షన్ వేడుకను నిర్వహించారు. అంతకుముందు, యూఏఈ అధ్యక్షుడిని తీసుకువెళుతున్న విమానం రాయల్ జోర్డానియన్ ఎయిర్ ఫోర్స్ నుండి విమానం ఎస్కార్టుగా వ్యవహారించింది. ఇది అమ్మాన్ చేరుకునే వరకు అధ్యక్ష విమానాన్ని వెంట వచ్చింది.
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రెసిడెన్షియల్ సిటీ
జోర్డాన్‌లోని జర్కాలో ఇటీవల కొత్త నివాస నగరం నిర్మించారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రెసిడెన్షియల్ సిటీ అని పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో 1,032 అపార్ట్మెంట్లు అధికారులు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు, జోర్డాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ - అరబ్ ఆర్మీ సభ్యులకు కేటాయించారు. కింగ్ అబ్దుల్లా II అంతకుముందు అధికారికంగా నగరాన్ని ప్రారంభించారు. ఇది జోర్డానియన్ సాయుధ దళాల నిర్దేశిత భూముల్లో 288-దునామ్ (1 దునం సుమారు 1,000 చదరపు మీటర్లు) ప్లాట్‌లో నిర్మించబడింది. ఈ నగర నిర్మాణానికి యూఏఈ ఆర్థిక సాయం అందించింది. జోర్డాన్‌లోని హాషెమైట్ కింగ్డమ్లో యూఏఈ రాయబారి షేక్ ఖలీఫా బిన్ మహ్మద్ బిన్ ఖలీద్ అల్ నహ్యాన్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ పైలట్ షేక్ అహ్మద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్, పలువురు ప్రముఖులతో పాటు ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







