తమన్నా డబుల్ ధమాకా.! ఇంకొన్నాళ్లు ఢోకా లేదుగా.!
- August 03, 2023
మిల్కీ బ్యూటీ తమన్నా వాస్తవానికి ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్ లిస్టులోకి వెళ్లిపోయింది. అయితే, అనూహ్యంగా మళ్లీ దూసుకొచ్చింది. తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించి కాస్త విమర్శల పాలైనా ఆ రకంగానైనా కంటిన్యూస్‌గా సోదిలో నిలిచి, ట్రెండింగ్ అయ్యింది.
ఆ సంగతి అలా వుంటే, ఆగస్టులో తమన్నా నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయ్. రెండూ పెద్ద సినిమాలే. తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ‘జైలర్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నానే హీరోయిన్.
ఈ సినిమాకి తమన్నా నటించిన ‘వా నువ్వు కావాలయ్యా..’ పాట ఎక్కడ లేని ప్రమోషన్ తెచ్చి పెట్టింది. తెగ ట్రెండింగ్ అయిపోయింది ఈ సాంగ్‌తో తమన్నా. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒక్క రోజు గ్యాప్‌లోనే అనగా ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘భోళా శంకర్’ మూవీ రిలీజ్ కాబోతోంది. సో, అలా తమన్నా ప్రస్తుతం వున్న క్రేజ్‌ని మరింత పెంచుకుంటోంది ఈ రెండు సినిమాలతో.
ఈ రెండు సినిమాలూ హిట్టయితే, ఇక ఇప్పట్లో తమన్నా కెరీర్‌కి ఢోకా లేనట్లే.! అంతేగా.! అంతేగా.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







