బాలుగాడి లవ్ స్టోరి నుంచి సోషల్ మీడియా షేక్ చేస్తున్న బేగంపేట కుర్రాదాన్ని మామా సాంగ్
- August 04, 2023
హైదరాబాద్: ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుంచి బేగంపేట లిరికల్ సాంగ్ వచ్చేసింది. కుర్రాకారును ఊపేసే బీట్తో ఈ పాట ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. టాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్ పృథ్వీ రాజ్ చేతుల మీదుగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వేదికగా విడుదల అయింది.
ఘనశ్యామ్ సంగీతాన్ని సమకూర్చగా ఎల్ శ్రీనివాస్ తేజ్ రాసిన ఈ పాటను ఎమ్ ఎమ్ మానసి అద్భుతంగా పాడారు. ఈ ఐటెం సాంగ్ చిత్రంలో ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది అని మేకర్స్ అంటున్నారు. అంతే కాకుండా ఈ పాటకు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో అఖిల్, మేఘా దాస్ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేశారన్నారు. పాట విడుదలై శ్రోతల నుంచి విశేష స్పందన పొందుతుంది. ఇక హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ ప్లేసులు బేగం పేట, మూస పేట, నిజాం పేట వంటి ప్రాంతాలను కలుపుతూ లిరిక్ రైటర్ శ్రీనివాస్ అద్భుతంగా రాశారు. ఇక సాంగ్ హుక్ లైన్స్ అయినా మస్త్ మజా, మస్త్ మజా మస్త్ మజారే పదాలు కూడా చాలా క్యాచీగా ఉన్నాయి. పాట సౌండింగ్ గానే కూకుండా విజువల్ గా కూడా చాలా గ్రాండ్ గా ఉంది.
ఆకుల అఖిల్, దర్శక మీనన్ హీరో హీరోయిన్లుగా. చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి నటీ నటులుగా యల్. శ్రీనివాస్ తేజ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేశారు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలుగాడి లవ్ స్టోరీ సినిమా ఆద్యాంతం నేటి యూత్ కు నచ్చేలా రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ కు మంచి విశ్వాసం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తులో సినిమా విడుదల చేస్తున్నట్లు.. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలుపుతున్నారు. ఇక సినిమాను ఖచ్చితంగా ప్రేక్షకులు ఆధారిస్తారని నమ్మకంగా ఉన్నారు.
నటీ నటులు :
ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి, లక్ష్మి, రాఘవరావు, మహేష్, సూరజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు :
సమర్పణ : ఆకుల భాస్కర్
బ్యానర్ : భామ క్రియేషన్స్
రైటర్, డైరెక్టర్ : యల్. శ్రీనివాస్ తేజ్
నిర్మాత : ఆకుల మంజుల
డి.ఓ.పి : రవి కుమార్ నీర్ల
మ్యూజిక్ డైరెక్టర్ : ఘనశ్యామ్
ఎడిటర్ : యాదగిరి కంజారాల
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







