పవన్ కోసం హరీష్ శంకర్.! అక్కడా ఇక్కడా.!
- August 04, 2023
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ తెర పైకి వచ్చింది. దాదాపు ఆగిపోయిందనుకున్న ఈ ప్రాజెక్ట్‌ని ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని డిసైడ్ అయ్యారట. దాంతో, ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా వున్న కారణంగా, ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్‌లోనే వుండాల్సి వస్తుంది. సో, అక్కడే సెట్స్‌లో ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారట.
అలాగే, సేమ్ సెట్స్ అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణాలోనూ వేసి పవన్ కళ్యాణ్ వున్న సీన్లను అక్కడ షూట్ చేసి, పవన్ కళ్యాణ్ లేని సీన్లను తెలంగాణాలో షూట్ చేసేయాలని అనుకుంటున్నారట.
అందుకోసం అక్కడా ఇక్కడా సేమ్ సెట్స్ వేసి మొత్తం సినిమాని సెట్స్‌లోనే కానిచ్చేద్దామనుకుంటున్నారట. ఓ వైపు ‘ఓజీ’ షూటింగ్లో పాల్గొంటూనే, మరోవైపు రాజకీయ వ్యవహారాలు కూడా చక్కబెడుతున్నసంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలక్షన్స్‌కి ముందే కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. అదీ సంగతి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







