ప్రమాదంలో గూగుల్ అకౌంట్. డిసెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు

- August 05, 2023 , by Maagulf
ప్రమాదంలో గూగుల్ అకౌంట్. డిసెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు

యూఏఈ: గూగుల్  తన కొత్త ఇన్‌యాక్టివిటీ పాలసీని ఆగస్ట్ 4న విడుదల చేసింది. దీని ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి యాక్టివ్‌గా లేని ఖాతాలను జీమెయిల్ అకౌంట్లను తొలగించడం ప్రారంభిస్తుంది. గూగుల్ ఖాతాల కోసం ఇనాక్టివిటీ వ్యవధిని రెండేళ్లకు అప్‌డేట్ చేసినట్లు వెల్లడించింది. వినియోగదారు రెండేళ్లలోపు లాగిన్ చేయకపోతే అకౌంట్ డీయాక్టివేట్ చేయనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. ఒకసారి తొలగించిన తర్వాత అది పునరుద్ధరణ కాదని తెలిపింది. అయితే ఇ-మెయిల్‌ అకౌంట్ ను, కంటెంట్ ను తొలగించే ముందు సంబంధిత వినియోగదారులకు అనేకసార్లు రిమైండర్ లను పంపుతామని స్పష్టం చేసింది.

YouTube ఖాతాలను కూడా తొలగిస్తారా?
YouTube గూగుల్ యాజమాన్యంలో ఉన్నందున, ప్రముఖ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని అకౌంట్లు పాలసీ పరిధిలోకి వస్తాయా లేదా అనేది చాలామందిలో సందేహం ఉంది. "యూట్యూబ్ ఛానెల్‌లు, వీడియోలు లేదా వ్యాఖ్యలతో" ఖాతాలకు పాలసీ నుండి మినహాయింపు ఉందని గూగుల్ తెలిపింది.  

ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడం ఎలా?
వినియోగదారులు తమ ఖాతాలను యాక్టివ్ గా ఉంచడంలో సహాయపడే కొన్ని సులభమైన మార్గాలను గూగుల్ వెల్లడించింది. ఇ-మెయిల్ చదవడం లేదా పంపడం, గూగుల్  డిస్క్‌ని ఉపయోగించడం, యూట్యూబ్ వీడియో చూడటం, ఫోటో షేర్, యాప్‌ను డౌన్‌లోడ్, గూగుల్ సెర్చ్, యాప్ లు లేదా ఇతర సేవలకు గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ చేయాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com