యూఏఈలో వర్ష బీభత్సం..!
- August 05, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ ఐన్ ప్రాంతంలో శుక్రవారం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్ళు, బలమైన గాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. పలు చోట్ల రోడ్లపై పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వర్ష బీభత్సానికి సంబంధంచిన వీడియోలను నెటిజన్లు తీసి ఆన్లైన్లో అప్ లోడ్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. కాగా, ఉత్తర అల్ ఐన్లో ఏర్పడిన అస్థిర వాతావరణ పరిస్థితులను , ట్రాఫిక్ అడ్డంకులను అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించాయి. మధ్యాహ్నం వర్షం కురిసిన సమయంలో రోడ్లు జారుడుగా మారడంతో అల్ ఐన్లోని హైవేపై ఒక ట్రక్కు పల్టీలు కొట్టింది. మరోవైపు వాతావరణ పరిస్థితుల కారణంగా అబుధాబి పోలీసులు అల్ ఐన్-దుబాయ్ రహదారిపై వేగ పరిమితిని తగ్గించారు. వాహనదారులను గంటకు 120 కిలోమీటర్లకు మించి వెళ్లవద్దని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఐన్లో నారింజ హెచ్చరికను జాతీయ వాతావరణ కేంద్రం (NCM) జారీ చేసింది. అలాగే మలాకిత్లో భారీ వర్షం నమోదు కాగా, అల్ హియార్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రి 8 గంటల వరకు అస్థిర వాతావరణం ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా షార్జాలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైనట్లు ఎన్సీఎం తెలిపింది. నివాసితులు, పౌరులు బయటకు వెళ్లిన సమయంలో జాగ్రత్తలు తసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







