బహ్రెయిన్ లో వర్క్ బ్యాన్. అమలును పర్యవేక్షించిన లేబర్ మినిస్టర్
- August 05, 2023
బహ్రెయిన్: జూలై మరియు ఆగస్టు నెలల్లో బహ్రెయిన్‌లో అవుట్‌డోర్ వర్క్ బ్యాన్‌కు కట్టుబడి ఉన్నందుకు కంపెనీలు, సంస్థలను కార్మిక మంత్రి జమీల్ హుమైదాన్ అభినందించారు. 2013 నాటి మంత్రివర్గ తీర్మానం నెం. 3కి అనుగుణంగా ఉండేలా వివిధ పని ప్రదేశాలను క్షేత్రస్థాయిలో మంత్రి పర్యటించారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు గంటలపాటు నిషేధం ఎండల తీవ్రత నుంచి కార్మికులను రక్షించేందుకు, వృత్తిపరమైన ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రథమ చికిత్స, ఇతర వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య చర్యలపై కార్మికులకు శిక్షణా కార్యక్రమాలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారు 2012 చట్టం నెం. 36 ప్రకారం జారీ చేసిన పౌర కార్మిక చట్టంలోని ఆర్టికల్ 192 ప్రకారం జరిమానాలను ఎదుర్కొంటారని హెచ్చిరంచారు. ఇందులో మూడు నెలల వరకు జైలు శిక్షలు, BD500 నుండి BD1000 వరకు జరిమానా లేదా ఈ రెండు విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







