మాస్ రాజా రవితేజ జోరు అస్సలు తగ్గేదే లే.!
- August 05, 2023
ఇప్పుడున్న స్టార్ హీరోల్లో మాస్ రాజా రవితేజ దూకుడుమీదున్నారని చెప్పొచ్చేమో. ఇటీవలే ‘వాల్తేర్ వీరయ్య’, ‘రావణాసుర’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన రవితేజ త్వరలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రాబోతున్నారు.
దీంతో పాటూ. ‘ఈగల్’ అనే సినిమానీ శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు రవితేజ. దసరా బరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. ఇదిలా వుంటే, తాజాగా రవితేజ మరో కొత్త ప్రాజెక్ట్ కన్పామ్ చేశాడు. గతంలో మూడు సినిమాలు చేసిన గోపీచంద్ మలినేనితో కొత్త ప్రాజెక్ట్‌పై సైన్ చేశాడు.
హ్యాట్రిక్ కాంబో అయిన ఈ కాంబోలో మూవీ అంటే అంచనాలు వుండడం సహజమే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తాజా ప్రాజెక్ట్ వుండబోతోందట. లేటెస్ట్గా గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో ‘క్రాక్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
అలాగే, గోపీచంద్ మలినేని లేటెస్ మూవీ ‘వీర సింహారెడ్డి’ ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్లో ఒకటి. సో, ఇటు రవితేజ, అటు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోయే తాజా ప్రాజెక్ట్ అలాలంటిలాంటిది కాదని అంటున్నారు. పక్కా మాస్ అండ్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







