నాగశౌర్యా.! నెక్స్‌ట్ ఏంటి పరిస్థితి.!
- August 05, 2023
పక్కింటబ్బాయ్ ఇమేజ్ వున్న హీరో నాగశౌర్య. మొదట్లో చేసిన అన్ని సినిమాలూ యావరేజ్ హిట్స్ అనిపించుకునేవి. మధ్యలో ప్రయోగాల జోలికి పోయాడు.
యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేశాడు. అలా ‘అశ్వధ్ధామ’, ‘లక్ష్య’ తదితర సినిమాలతో ఫెయిల్యూర్స్ చవి చూశాడీ యంగ్ హీరో.
ఈ మధ్య మళ్లీ మనసు మార్చుకున్నాడు. ‘రంగబలి’ సినిమాతో తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రదర్శించాడు. సో, అలా ‘రంగబలి’ ఓ మోస్తరు టాక్‌తో గట్టెక్కేసింది.
అయితే, నాగశౌర్య నుంచి ప్రేక్షకులు కోరుకునేది ఈ మాత్రం కాదు. అంతకు మించి. సో, ప్రస్తుతం అదే పనిలో వున్నాడట నాగ శౌర్య. ఇంతవరకూ ఏ కొత్త సినిమానీ ఓకే చేయలేదట.
తన ఇమేజ్‌కి తగ్గ స్ర్కిప్ట్ వస్తే ఓకే చేద్దామనీ, అంత వరకూ కాస్త లేటయినా, లేటెస్ట్‌గా వద్దామనుకుంటున్నాడట. ఆచి తూచి అడుగులేయాలనుకుంటున్నాడట. ఆ దిశగానే నెక్స్‌ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడనీ తాజా సమాచారం. అన్నట్లు ‘రంగబలి’ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజై ఓటీటీ ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తోందండోయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







