బిజినెస్ బాగానే పెరిగిందయ్యా కార్తీ.!
- August 05, 2023
తమిళ హీరో కార్తికి తెలుగులోనూ మంచి మార్కెట్ వుంది. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ బాగా ఆకట్టుకుంటున్నాడు హీరో కార్తి. ‘ఊపిరి’ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగు సినిమాలో నటించేశాడు కార్తి.
తెలుగు, తమిళం అనే భాషా బేధం లేకుండా కార్తిని నిజంగానే అందరూ ప్రత్యేకంగా అభిమానిస్తుంటారు. కార్తి నటించిన ‘ఖైదీ’ తదితర సినిమాలు ఆయన రేంజ్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయ్.
తాజాగా ‘జపాన్ మేడ్ ఇన్ ఇండియా’ సినిమాతో కార్తి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ విశేషంగా అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా ఈ సినిమాలో కార్తి కనిపించబోతున్నాడు. డిఫరెంట్ గెటప్స్.. డిఫరెంట్ మ్యానరిజమ్స్‌తో ‘జపాన్’ ఇప్పటికే ఓ రేంజ్ ట్రెండింగ్ అయిపోతున్నాడు. ఇక, రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏ స్థాయిలో సెన్సేషన్ అవుతుందో చూడాలి మరి.
అన్నట్లు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ గతంలో కార్తి నటించిన ఏ సినిమాకీ లేనంత విధంగా జరిగిందట. దాదాపు 150 కోట్ల బిజినెస్ జరిగిందనీ ట్రేడ్ వర్గాల అంచనా.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







