OPEC+ చమురు ఉత్పత్తి స్థాయిలు యథాతథం..!
- August 06, 2023
రియాద్: ప్రస్తుత చమురు ఉత్పత్తి స్థాయిలను OPEC+ జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ (JMMC) వెల్లడించింది. ప్రస్తుత సమయంలో ఉత్పత్తి స్థాయిలను యథాతథంగా ఉంచనున్నట్లు పేర్కొంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ (JMMC) 49వ సమావేశానికి సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. JMMC మే, జూన్ 2023 నెలల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి డేటాను సమీక్షించింది. 4 జూన్ 2023న జరిగిన 35వ OPEC, నాన్-OPEC మినిస్టీరియల్ మీటింగ్ (ONOMM)లో అంగీకరించిన విధంగా 2024 చివరి వరకు కొనసాగే DoCకి దాని సభ్య దేశాల నిబద్ధతను కమిటీ పునరుద్ఘాటించింది. చమురు మార్కెట్ స్థిరత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలకు కమిటీ తన పూర్తి మద్దతును ప్రకటించింది. సెప్టెంబరు నెల వరకు రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల అదనపు స్వచ్ఛంద కోత కొనసాగించనున్నట్టు వెల్లడించింది. JMMC (50వ) తదుపరి సమావేశం అక్టోబర్ 4న జరగనుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







