2023 ప్రథమార్థంలో 14,163 మంది బహ్రెయిన్‌లకు ఉపాధి
- August 06, 2023
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని ప్రభుత్వం వివిధ రంగాల్లో బహ్రెయిన్‌ల ఉపాధి రేటును వేగవంతం అయిందని బహ్రెయిన్ లేబర్ మంత్రి, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చైర్మన్ జమీల్ బిన్ మొహమ్మద్ అలీ హుమైదాన్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు పెట్టుబడులను ఆకర్షించడం, పని వాతావరణాన్ని మెరుగుపరచడం, శిక్షణ మరియు అర్హత విధానాలను వైవిధ్యపరచడం, ప్రైవేట్ రంగానికి అనేక ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బహ్రెయిన్‌లు లేబర్ మార్కెట్‌లో రిక్రూట్‌మెంట్‌లో మొదటి ఎంపికగా ఉంటారని మంత్రి చెప్పారు. 2023 రెండవ త్రైమాసికంలో కార్మిక మార్కెట్ సూచికల క్యాబినెట్ సమీక్ష సందర్భంగా మంత్రి ఈ మేరకు ప్రకటించారు. ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలో జనవరి, జూన్ మధ్య 71% చొప్పున 14,163 మంది ఉపాధి పొందారని పేర్కొన్నారు. వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారా లబ్ది పొందుతున్న పౌరుల సంఖ్య 7,237 మంది ట్రైనీలకు చేరుకుందని, ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా ఏటా 10,000 మంది బహ్రెయిన్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రకటించిన లక్ష్యంలో ఇది 72% అని హుమైదాన్ చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







