‘భోళా శంకర్.! నన్ను అన్నయ్యా.. అని పిలవొద్దు ప్లీజ్.!
- August 07, 2023
మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ కలిసి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. లేటెస్ట్‌గా జరిగిన ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా కేవలం ఈ సినిమా వరకే మేమిద్దరం అన్నా చెల్లెళ్లం.. ఆ తర్వాత కాదు.. ఏమో భవిష్యత్తులో హీరోయిన్‌గా నటించే అవకాశాలుండొచ్చు.. అని కీర్తి సురేష్‌తో అన్నారు.
కీర్తి సురేష్ చాలా మంచి నటి. మహా నటి సినిమా చూసి.. తానెంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. అలనాటి మహానటి సావిత్రిని మ్యాచ్ చేయడం అంత చిన్న విషయం కాదు.. అలాంటిది కీర్తి సురేష్ చేసి చూపించింది. ఆమెకు మంచి భవిష్యత్తు వుంది.. అని కీర్తిని బ్లెస్ చేశారు చిరంజీవి.
ఈ సినిమాలో చిరంజీవి గారితో కలిసి నటించడం తనకెంతో ఆనందంగా వుందనీ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. కీర్తి, చిరంజీవి మద్య వచ్చే సన్నివేశాలు ఎంతో హృధ్యంగా వుంటాయని, అందర్నీ ‘భోళా శంకర్’ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిరంజీవి తెలిపారు. ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







