ఇలియానాకి కొడుకు పుట్టేశాడోచ్.!
- August 07, 2023
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారు కదా.. అచ్చం అలాగే, గోవా బ్యూటీ ఇలియానా విషయంలో ఆలూ వుంది. చూలూ వుంది.. కొడుకు పేరు కూడా వుంది.
ఇలియానా కొడుకు పేరు ‘కోవా ఫోనిక్స్ డోలన్’. ఆగస్టు 1న కోవాకి జన్మనిచ్చింది ఇలియానా. ఈ మధ్య తన బేబీ బంప్‌ని చూపిస్తూ సోషల్ మీడియాలో ఇలియానా తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
భర్త పేరు చెప్పకుండానే తాను తల్లి అవుతున్న విషయాన్ని వెల్లడించింది ఇలియానా. అప్పటి నుంచీ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే వుంది.
తాజాగా తన కొడుకును పరిచయం చేస్తూ పేరు కూడా వెల్లడించింది. ఇంత చేస్తున్న ఇలియానా ఇంతవరకూ తన భర్తను పరిచయం చేయకపోవడం ఆశ్చర్యకరం. అప్పుడెప్పుడో కనీ కనిపించని ఓ వ్యక్తి ఫోటోని పోస్ట్ చేస్తూ, భర్త గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అప్పటి నుంచీ ఆయనే ఇలియానా భర్తయ్యి వుంటాడనుకున్నారంతా. కానీ, అతని పేరు కానీ, ఫోటో కానీ లీక్ చేయలేదింతవరకూ.
ఏది ఏమైతేనేం, మొత్తానికి ఇలియానా అయితే ఓ బిడ్డకి తల్లయిపోయింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







