తమన్నా అంత బిజీనా.!
- August 07, 2023
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడి ముద్దుగుమ్మల విషయంలో బాగా వినిపిస్తుంటుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడదే చేస్తోంది. నిజానికి ఎప్పుడో ఫేడవుట్ అయిపోయింది తమన్నా. కానీ, అవకాశాలు మాత్రం ఆమెకి ఇంకా ఇంకా వస్తూనే వున్నాయ్.
తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘జైలర్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తెలుగులో ‘భోళా శంకర్’ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవితో స్ర్కేన్ షేర్ చేసుకుంటోంది.
ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ పక్క సినిమాల్లో ఈ రేంజ్ స్టార్ స్టేటస్ పొందుతూనే, మరోవైపు ఓటీటీలోనూ తమన్నా జోరు పెంచింది. మొన్నీ మధ్యనే ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించి సెన్సేషనల్ అయ్యింది.
ఇప్పుడు మరిన్ని ఓటీటీ కంటెంట్స్ తమన్నా కోసం ఎదురు చూస్తున్నాయట. కొన్ని ఆల్రెడీ సెట్స్ మీద వుండగా, ఇంకొన్ని చర్చల దశలో నడుస్తున్నాయట. చూస్తుంటే, ఇప్పట్లో తమన్నా డైరీ ఖాళీ అయ్యేలా కనిపించడం లేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







