బన్నీ కోసం ఎదురు చూస్తున్న ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్.!
- August 07, 2023
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ వంగా. ఇదే సినిమాని హిందీలోనూ రీమేక్ చేసి, అక్కడా బోలెడంత క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు బాలీవుడ్లో సందీప్ రెడ్డి వంగా.
అయితే, సందీప్ ఖాతాలో ప్రబాస్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో సహా ఆ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేసేశాడు సందీప్ రెడ్డి.
అయితే, ప్రబాస్ ప్రస్తుతం వున్న బిజీ షెడ్యూల్లో ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు. సో, సందీప్ రెడ్డి మనసు మార్చుకున్నాడట. ఆయన ఖాతాలోని మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో చేయాల్సి వుంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా ఓ కొలిక్కి రాగానే, సందీప్ రెడ్డి సినిమా కోసం డేట్స్ ఇవ్వనున్నాడట. సో, అలా సందీప్ రెడ్డి నుంచి నెక్స్ట్ రాబోయే చిత్రం అల్లు అర్జున్‌దే అయ్యుండొచ్చని గాసిప్ వినిపిస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







