ఒమన్ వృద్ధికి పెద్ద అడ్డంకి హిడెన్ ట్రేట్..!
- August 07, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో హిడెన్ ట్రేడింగ్ ను ఎదుర్కోవడానికి ఇటీవలి మంత్రివర్గం నిర్ణయాన్ని ఒమానీ వ్యాపారవేత్తలు, పౌరులు హృదయపూర్వకంగా స్వాగతించారు. వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ (MoCIIP) తీసుకున్న నిర్ణయం జాతీయ ఆర్థిక వ్యవస్థను, స్థానిక మార్కెట్లను అస్థిరపరిచే అంశాలను నిరోధించడానికి ప్రభుత్వ చురుకైన విధానంలో భాగమని ఒమానీ వ్యాపారవేత్త హజ్జా బిన్ సలేహ్ అల్ బలూషి తెలిపారు. హిడెన్ ట్రేడింగ్ లో ఆదాయాలు, లాభాలు లేదా కాంట్రాక్ట్ ఆదాయాన్ని వ్యక్తిగత లేదా నమోదు చేయని ఖాతాలకు మళ్లించడం, లైసెన్స్ దరఖాస్తు సమయంలో సరికాని డేటా లేదా సమాచారాన్ని అందించడం తదితర అంశాలు ఉంటాయని తెలిపారు. కొత్త నిబంధనల అమలును అనుసరించి పునరావృతమయ్యే ఉల్లంఘనల కోసం కఠినమైన చర్యలను ప్రవేశపెట్టారని, జరిమానా కానీ మూడు నెలల పాటు కార్యకలాపం సస్పెన్షన్ విధించే అవకాశం ఉందన్నారు స్టేట్ కౌన్సిల్లోని సామాజిక, విద్యా అధ్యయనాలలో నిపుణుడు డాక్టర్ రజబ్ బిన్ అలీ అల్ ఒవైసీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







