సౌదీలో 51 నకిలీ వెబ్సైట్లు బ్లాక్
- August 08, 2023
రియాద్: వెబ్ సెర్చ్ ఇంజన్ల ద్వారా ప్రకటనలను ప్రమోట్ చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ వలె కనిపించి మోసం చేస్తున్న 51 నకిలీ వెబ్సైట్లను వాణిజ్య మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. మోసపూరిత ప్రయత్నాల నుండి వినియోగదారులను రక్షించడంలో మంత్రిత్వ శాఖ కఠినంగా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే అన్ని వెబ్సైట్లను పర్యవేక్షించడానికి, నిరోధించడానికి తమ నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్రహ్మాన్ అల్-హుస్సేన్ స్పష్టం చేశారు. ఏదైనా నకిలీ వెబ్‌సైట్‌ను రిపోర్ట్ సెంటర్ ద్వారా 1900 లేదా బాలాగ్ యాప్ ద్వారా రిపోర్ట్ చేయాలని వినియోగదారులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







