కేరళ పేరు మార్చాలంటూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
- August 09, 2023
త్రివేండ్రం: కేరళ పేరుని "కేరళం"గా మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ప్రవేశ పెట్టింది. నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కేరళ పేరుని కేరళంగా మార్చాలని కోరింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చ మొదలైంది. రాష్ట్ర సాంస్కృతిక ప్రాధాన్యతను, చరిత్రను దృష్టిలో పెట్టుకుని పేరు మారిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన చేస్తోంది పినరయి విజయన్ ప్రభుత్వం. నిజానికి ఈ పేరు మార్పు డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. రాష్ట్ర సాంస్కృతిక, భాషావేత్తలు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించారు. చరిత్రలో కేరళ పేరు "కేరళం"గానే ఉందని, మలయాళ భాష పరంగా చూసినా ఇదే సరైన పేరు అని తేల్చి చెబుతున్నారు భాషావేత్తలు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసగించిన సమయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ పేరు మార్పుతో రాష్ట్ర సంస్కృతిని, చరిత్రను గౌరవించినట్టు అవుతుందని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణమనీ చెప్పారు.
"రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం కేరళ పేరుని కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని చోట్లా కేరళ పేరు మారాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోనూ ఈ మేరకు మార్పులు జరగాలి. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రం పేరు కేరళగానే ఉంది" అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







