రైస్ బ్యాగులను తెచ్చుకుంటున్న భారతీయ ప్రవాసులు
- August 10, 2023
యూఏఈ: జూలై 20 నుండి బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై భారతదేశం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది యూఏఈ నివాసితులు వేసవి సెలవుల తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఇండియా నుండి బియ్యాన్ని(రైస్) తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇండియా నుంచి బియ్యం తీసుకురావడం అవసరం కంటే ఎక్కువ అలవాటని భారతీయ ప్రవాసురాలు షబ్నాకు తెలిపింది. "ప్రతి సంవత్సరం, మేము మా ఊరిలో లభ్యమయ్యే ఒక నిర్దిష్ట రకం బియ్యాన్ని తీసుకువస్తాము." అని ఆమె చెప్పింది. బియ్యం ప్యాకెట్ ను ఇండియా నుంచి తేవడం ద్వారా కేవలం ఆమె కుటుంబానికి 3 దిర్హామ్ మాత్రమే ఆదా అవుతుంది. "ఇది నిజంగా పెద్ద పొదుపు కాదు. కానీ మేము ఇండియాకు వెళ్ళినప్పుడు, సామానులో స్థలం ఉన్నప్పుడు, మేము బియ్యాన్ని తిరిగి తీసుకువస్తాము." అని ఆమె వివరించింది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో ఇండియా 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 140 కంటే ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. మరోవైపు బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధాన్ని యూఏఈలోని చిల్లర వ్యాపారులు క్యాష్ చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, స్థానిక సూపర్ మార్కెట్ల ప్రకారం.. ఇది తాత్కాలిక సమస్య అని వియత్నాం, థాయిలాండ్, పాకిస్తాన్ నుండి ఎగుమతులు పెరిగితే యూఏఈలో బాస్మతీయేతర బియ్యం సరఫరా లోటు తగ్గుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







