యూఏఈలో భారీ వర్షాలు. ఆరెంజ్ అలెర్ట్ జారీ
- August 11, 2023
యూఏఈ: అస్థిర వాతావరణం కొనసాగుతున్నందున నివాసితులకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అస్థిర వాతావరణ పరిస్థితుల నివాసితులను ఎన్‌సిఎం హెచ్చరించింది. నివాసితులు ఆరుబయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో "ప్రమాదకర వాతావరణ సంఘటనలు" జరిగే ప్రమాదం ఉందని సూచిచంచింది. స్థానిక అధికారులు ఇచ్చే సలహాలను ప్రజలు పాటించాలని కోరారు. దేశంలోని తూర్పు ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో కార్లు వరదలతో నిండిన రోడ్ల గుండా వెళుతున్న వీడియోను ఎన్‌సిఎం షేర్ చేసింది. లోయలు, ఆనకట్టలు మరియు నీరు ప్రవహించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని నివాసితులు, సందర్శకులను కోరుతూ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. వర్షాలు కురిసే సమయంలో ఇంటి నుండి బయలుదేరే ముందు వాహనదారులు లైట్లు, వైపర్లు, టైర్లు, వాహనం యొక్క చెల్లుబాటును తనిఖీ చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో దుబాయ్, అల్ ఐన్, షార్జా మరియు ఫుజైరా వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని NCM ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







