ఆఫ్రికన్ నైట్ ఆఫ్ లాఫ్టర్‌లో పాల్గొన్న టాప్ కమెడియన్స్
- August 11, 2023
దోహా: ఆఫ్రికన్ నైట్ ఆఫ్ లాఫ్టర్‌లో టాప్ ఆఫ్రికన్ హాస్యనటులు మిస్టర్ ఫన్నీ (నైజీరియా), కు మమ్మిటో యునిస్(కెన్యా) పాల్గొని సందడి చేశారు. గురువారం హాలిడే ఇన్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా రాయబారి హెచ్‌ఈ గులాం హుస్సేన్, కెన్యా రాయబారి హెచ్‌ఈ బోనిఫేస్ మ్విలు, నైజీరియా, ఘనా, రువాండా, ఉగాండా రాయబార కార్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ గులామ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. ఆఫ్రికా తన ప్రతిభను, హాస్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫ్రికన్లు, ఆసియన్లు, యూరోపియన్లు, అమెరికన్లతో సహా ఖతార్ ఉంటున్న వివిధ దేశాల వారు పాల్గొని ఆస్వాదించారు. ఆఫ్రికన్ నైట్ ఆఫ్ లాఫ్టర్‌ను ఓరిక్స్ గ్రూప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వహించగా.. ఖతార్ టూరిజం స్పాన్సర్ చేసింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







