మాతృభూమి పురోగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
- August 11, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌ల ఆశయాల పట్ల హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. మాతృభూమికి సేవ చేయాలనే నిరంతర ఆసక్తిని కలిగిఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాలు, వర్గాల నుండి బహ్రెయిన్ పౌరులు గౌరవం, ప్రశంసలను పొందుతున్నారని తెలిపారు. "మా మాతృభూమి పురోగతిని పెంపొందించే అన్ని రంగాలలో పౌరులకు ఉత్తమమైన వాటిని అందించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము" అని కింగ్ హమద్ చెప్పారు. "ది ఫఖ్రోస్ ఆఫ్ బహ్రెయిన్ – వ్యాపారులు, సంస్కర్తలు" అనే పుస్తకాన్ని తనకు బహూకరించిన డా. అలీ మహమ్మద్ ఫఖ్రో నేతృత్వంలోని అనేక మంది ఫఖ్రో కుటుంబ సభ్యులను అల్ సఫ్రియా ప్యాలెస్‌లో కలుసుకున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రచురించబడిన ఈ పుస్తకాన్ని వ్యాపారవేత్త అడెల్ అబ్దుల్లా ఫఖ్రో రాశారు. దేశానికి సేవ చేయడంలో ఫఖ్రో కుటుంబం పాత్రను ఈ సందర్భంగా కింగ్ హమద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







