డా.మాచర్ల రాధను భర్తే హత్య చేశాడు: ఎస్పీ జాషువా...
- August 11, 2023
మచిలీపట్నం: కట్టుకున్న వాడే కాల యముడయ్యాడు. డాక్టర్ మాచర్ల రాధను ఆమె భర్తే హత్య చేశాడు. ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు.
రాధ హత్య కేసులో A-1 ముద్దాయి మృతురాలి భర్త డాక్టర్ మహేశ్వరరావు అని తెలిపారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కారణంగా డ్రైవర్ జనార్ధన్ అలియాస్ మధుతో కలిసి డాక్టర్ మహేశ్వరరావు భార్యను హత్య చేసేందేకు ప్రణాళిక సిద్ధం చేశారని వెల్లడించారు.
అనుకున్న ప్రణాళిక ప్రకారం జూలై 25న సాయంత్రం గ్యాస్ సిలిండర్ మూతలు ఓపెన్ చేసే రెంచ్ తో డ్రైవర్ మధు మృతురాలు మాచర్ల రాధ చేతులు వెనక్కి విరచి పట్టుకోగా భర్త డాక్టర్ మహేశ్వరరావు నాలుగు సార్లు బలంగా భార్య తలపై కొట్టగా ఆమె స్పృహతప్పి పడిపోయారని చెప్పారు.
అనుమానం వచ్చి మళ్ళీ చనిపోయే వరకు ఆమెను కొట్టారని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా హత్య స్థలంలో కారం చల్లి అక్కడి నుండి వారు వెళ్లిపోయారని తెలిపారు. కారంను సైతం హత్య స్థలానికి ఒక కిలో మీటరు దూరంలో కొనుగోలు చేసి తీసుకొచ్చినట్టు విచారణలో బయటపడినట్లు చెప్పారు. హత్యకు గల మిగతా కారణాలను కూలంకశంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







