సెప్టెంబరు 1 నుంచి హోటల్ రూమ్‌లు, రెస్టారెంట్ల ఫీజులు తగ్గింపు
- August 12, 2023
అబుధాబి: డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం- అబుధాబి (DCT - అబుధాబి) శుక్రవారం ఎమిరేట్‌లోని హోటళ్లకు వర్తించే ప్రభుత్వ రుసుములను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆతిథ్య, పర్యాటక రంగం నిరంతర వృద్ధికి మద్దతు ఇస్తుందని, అదే విధంగా పర్యాట రంగంలో అబుధాబిని ప్రపంచ అగ్రగామిగా నిలపుతుందని పేర్కొంది. ఈ మార్పులు సెప్టెంబరు 1, 2023 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. అతిథులకు ఇచ్చే పర్యాటక రుసుమును ఆరు శాతం నుండి నాలుగు శాతానికి తగ్గించారు. ఒక రాత్రికి ఒక గదికి Dh15 మునిసిపాలిటీ రుసుమును తీసివేశారు. ఆరు శాతం టూరిజం రుసుమును తీసివేయడం మరియు హోటల్ రెస్టారెంట్లకు వర్తించే నాలుగు శాతం మునిసిపాలిటీ రుసుము తగ్గింపు నిర్ణయంలో ఉన్నాయి. అలాగే కస్టమర్‌కు జారీ చేసిన ఇన్‌వాయిస్ విలువలో 4 శాతం మున్సిపాలిటీ రుసుము మాత్రం కొనసాగుతుందని తెలిపింది. 2023 చివరి నాటికి 24 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు DCT - అబుదాబిలో టూరిజం డైరెక్టర్ జనరల్ సలేహ్ మొహమ్మద్ అల్ గెజిరీ తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







