మూడు వారాల పాటు చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత: ఎమిరేట్స్
- August 12, 2023
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని చెక్-ఇన్ కౌంటర్లను మూడు వారాల పాటు మూసివేస్తున్నట్లు దుబాయ్‌కి చెందిన ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్ తెలిపింది. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 1 వరకు ఎమిరేట్స్ ప్రయాణీకులు, ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే ఎమిరేట్స్ స్కైవార్డ్స్ గోల్డ్ సభ్యులు ఏరియా 6లోని తమ ప్రీమియం చెక్-ఇన్ కౌంటర్లకు వెళ్లాలని ఎయిర్‌లైన్ సూచించింది. ఎమిరేట్స్ ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు రోజు రాత్రి ఎటువంటి రుసుము లేకుండా తమ లగేజీని విమానాశ్రయంలో వదిలివేయవచ్చని పేర్కొంది. దుబాయ్ నుండి బయలుదేరే ప్రయాణీకులు ముందుగా చెక్ ఇన్ చేసి, బయలుదేరడానికి 24 గంటల ముందు లేదా అమెరికా, టెల్ అవీవ్‌కు వెళ్లినట్లయితే బయలుదేరే 12 గంటల ముందు బ్యాగ్‌లను డ్రాప్ చేయవచ్చని తెలిపింది. ప్రయాణీకులు ICD బ్రూక్‌ఫీల్డ్ ప్లేస్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో కొత్త సిటీ చెక్-ఇన్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







