కువైట్‌లో ICC ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరణ
- August 12, 2023
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, కువైట్ క్రికెట్ ప్రెసిడెంట్ మిస్టర్ హైదర్ అబ్బాస్ ఫర్మాన్ ICC ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందులో ICC డిప్యూటీ ఛైర్మన్, ఇమ్రాన్ ఖవాజా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌ను ఇండియాలో జరుగనుంది. ఈ ట్రోఫీ ఆవిష్కరణ వేడుకలో కువైట్ క్రికెట్ అధికారులు, ICC, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ అధికారులు, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ రాయబారులు, మలేషియా రాయబార కార్యాలయానికి చెందిన దౌత్యవేత్తలు మరియు ప్రముఖులు హాజరయ్యారు. ICC మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా కువైట్, బహ్రెయిన్, మలేషియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆతిథ్య దేశం భారతదేశంతో సహా 18 దేశాలలో ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







