పశ్చిమ గోదావరి జిల్లాలో డిఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
- August 12, 2023అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో స్థానిక ప్రజలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కోటి ఇరవై లక్షల వ్యయంతో 4500పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన రెండు అంతస్తుల డిఎస్పీ కార్యాలయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ సంధర్భంగా డిజిపి గారు మాట్లాడుతూ ప్రస్తుతం నరసాపురంలో కొనసాగుతున్న డిఎస్పి కార్యాలయం భవనం వంద సంవత్సరాల క్రితం నిర్మామితమైన పురాతన భవనంలో కొనసాగుతుంది. ఇటీవల కాలంలో ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో ఆ భవనానికి పునరుద్ధరణ పనులు చేపడితే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ భవనం మనుగడ కోల్పోతుందని భావించిన స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యామ్నాయంగా సమీపంలోనే నూతనగా అత్యంత ఆధునిక సదుపాయాలతో డిఎస్పీ నివాసం తో కూడిన రెండవ అంతస్తుల భవనాన్ని నిర్మించడం ఎంతో అభినందనీయం అన్నారు.
ఈ నూతన భవనంలో డిఎస్పీ కార్యలయం 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో, డిఎస్పీ నివాసం మొదటి అంతస్తు 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగిందని ప్రజలతో సత్సంబంధాలు లేకుండా పోతే ఇటువంటి మంచి కార్యక్రమం జరిగేది చాలా అసాధ్యం. ఇక్కడ పనిచేసే `అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల మధ్య మంచి అనుసంధానం ఉంది కాబట్టే ఒకటి చక్కటి ఆలోచనతో పోలీసులకు కట్టించి ఇవ్వడం అనేది మంచి పరిణామం. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజల సహకారంతో నిర్మించి ఇవ్వడం జరిగింది.ఎక్కడైతే ఈ చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడ ప్రజలకు పోలీసుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అవగతం అవుతున్నాయి. పోలీసుల పైన ప్రేమ అభిమానాలు లేకపోతే ఈ రకమైనటువంటి చక్కటి ఆలోచన కలిగి ఉండేది కాదు. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో రావాలని నేను డిజిపిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
104 కేసుల్లో ముగ్గురికి మరణ శిక్ష, 37 మందికి జీవిత ఖైదీ, 62 కేసుల్లో 7 నుండి 20 సంవత్సరాల జైలు శిక్షలు. మహిళలపై నేరాలు, పోక్సో కేసులు మరియు ఇతర తీవ్రమయిన నేరాలకు సంబంధించిన కేసులను పైలట్ ప్రాతిపదికన గుర్తించి అత్యంత పకడ్బందీగా కేసు విచారణ చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం 14,000 కేసులను కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ లో ప్రతి పోలీసు అధికారికి 10 కేసుల చొప్పున కేటాయించి 1000 కేసులను ఇప్పటికే పరిష్కరించాము. ముందస్తూ ప్రణాళికతో లక్ష్యన్ని నిర్దేశించి ఫాస్ట్ ట్రాక్ విచారణ ద్వారా 3 నెలల్లోనే తీవ్రమైన నేరాలను పరిష్కరిస్తున్నాం.
ప్రభుత్వ సహకారంతో సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రత్యేక 133 మందితో సైబర్ సెల్ ల ఏర్పాటు చేయడం తో పాటు మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయం లోని సైబర్ సెల్ మరియు సోషల్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయడంతోపాటు సీనియర్ అధికారి పర్యవేక్షణలో సిబ్బందికి సైబర్ నేరాల నియంత్రణ కోసం కీలకమైన అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించి సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా బ్యాంక్ అక్కౌంట్ హక్క్ చేసి ప్రజల డబ్బును కొల్లగొట్టే నేరాలను నియంత్రించేందుకు 1930 యప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నాము. దీని ద్వారా సకాలంలో డబ్బును రికవరీ పొందేందుకు వీలుకలుగుతుంది.దీనిని ప్రతి ఒక్కరూ స్వాదినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా , ఏజెన్సీ ప్రాంతాలలోని కొన్ని మండలాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 2021లో 7500 ఎకరాలు, 2022లో 1000 ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేయడం జరిగింది.
అంతేకాకుండా కాకుండా గంజాయి సాగు, నియంత్రణపై విధానపరమైన కార్యక్రమాలతోపాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, ప్రత్యామ్నాయ పంటలపై పోలీసులు వారికి అవగాహన కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, స్థానిక గ్రామ సర్పంచులు, రైతులతో విస్తృతంగా చర్చలు జరిపి మండలాల వారీగా ఎన్ని పంచాయతీలు, గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతోంది, వాటికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడానికి రైతులకు పూర్తి సహకారం అందించడానికి కృషి చేస్తుంది. గిరిజనులకు భూహక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అటు తీవ్రవాదం అంతానికి, గంజాయి నిర్మూలనకు ఉపయోగకారిగా మారింది.
పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ దాడికి పాల్పడింది స్థానికులలా, లేక బయట వ్యక్తులా అన్నదానిపై లోతైన విచారణ జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ను దెబ్బ తీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవర్ని ఉపేక్షించం. పోలీసు వ్యవస్థ అందరికోసం అని రాజకీయ పార్టీలు గుర్తించి సహకరించాలి.
దేశంలోనే మహిళా భద్రతకు విశిష్ట ఘనత వహించిన దిశ యాప్ డౌన్‌లోడ్స్. రిజిస్టేషన్స్ లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది పోలీస్ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీసులు దిశ యాప్‌ను ప్రతి ఒక్కరి వద్దకు చేర్చాలన్న దృఢ సంకల్పంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అత్యధిక డౌన్‌లోడ్స్ రిజిస్ట్రేషన్ సాధించడంలో పోటీపడుతున్నారు. ఈ రోజు వరకు 1,40,00,000 మందికి పైగా దిశ యప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దిశ SOS వచ్చిన సమాచారంతో ఇప్పటివరకు ఆపదలో ఉన్న 27,000 మందికి పైగా మహిళలను రక్షించటంతో పాటు దిశ SOS ద్వారా వచ్చిన ఫిర్యాదులపై 2,000లకు పైగా ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MLA Prasad Raj, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, SP రవి ప్రకాష్, DSP రవి మనోహరాచారి, DSP ఆంజనేయ రెడ్డి, దాతలు విశ్వనాథ రాజు , అజిత్ కుమార్ జైన్ లతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!