బెల్లంతో ఆ సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు తెలుసా.?
- August 12, 2023
పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. కానీ, పంచదారనే ఎక్కువగా మనం ఇష్టపడుతుంటాం. బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా బెల్లాన్ని డైలీ మెనూలో చేర్చుకుంటాం.
బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి, ఇ అధికంగా వుంటాయ్. కాల్షియం అధికంగా వుండడం వల్ల ఎముకలు దృడంగా వుంటాయ్. అలాగే, విటమిన్ బి, ఇ కారణంగా మలబద్ధకం సమస్యతో పాటూ, మహిళల్లో రుతుక్రమం తదితర సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
బెల్లం రోజూ తినడం వల్ల రక్త హీనత సమస్య దరి చేరదు. రక్తపోటు అదుపులో వుండడం వల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా వుంటారు.
బెల్లం, సోంపు కలిపి తింటే నోటి దుర్వాసన సమస్యలు దరి చేరవు. అలాగే, నువ్వులతో కలిపి బెల్లాన్ని తీసుకుంటే, శరీరానికి శక్తితో పాటూ, జలుబు, దగ్గు వంటి సీజనల్ ఫ్లూ నుంచి దూరంగా వుండొచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







