ఓటీటీలోకి అల్లు అర్జున్.?
- August 12, 2023
ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇటు చిన్న చిన్న ఆర్టిస్టులకూ, ఫేమలో లేని ఆర్టిస్టులకూ ఆసరాగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో పెద్దగా పీకిందేమీ లేకపోయినా.. ఓటీటీ కంటెంట్ ద్వారా తమలోని కొత్త టాలెంట్‌ని బయటికి తీసే అవకాశం కలుగుతోంది చాలా మంది నటీ నటులకి.
ఈ క్రమంలోనే ఆయా నటీ నటులు ఓటీటీ ప్రేక్షకుల ద్వారా మంచి ఆదరణ పొందుతున్నారు. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా స్టార్ సెలబ్రిటీలు సైతం ఓటీటీ కంటెంట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు కూడా.
ఈ నేపథ్యంలోనే త్వరలో అల్లు అర్జున్ కూడా ఓటీటీ తెరపై సందడి చేయబోతున్నారనీ తెలుస్తోంది. హోమ్ ఛానెల్ ఆహా రూపొందించబోయే ఓ వెబ్ సిరీస్‌లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడట.
పూర్తి స్థాయి పాత్ర కాదట. గెస్ట్ రోల్‌లా వుండబోతోందట. ఇంతవరకూ ఆహా ఛానెల్‌ని ప్రమోట్ చేసేలా కొన్ని యాడ్ షూట్స్‌లో పాల్గొన్నాడు అల్లు అర్జున్. ఒకవేళ జరుగుతున్న ప్రచారం నిజమైతే, ఇదే అల్లు అర్జున్‌కి ఫస్ట్ ఓటీటీ కంటెంట్ కావచ్చు. చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







