'భోళా శంకర్’ని అదే మైనస్ అయ్యిందా.?

- August 12, 2023 , by Maagulf
\'భోళా శంకర్’ని అదే మైనస్ అయ్యిందా.?

రీ ఎంట్రీలో చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రీమేకులే అయినప్పటికీ రికార్డులు కొల్లగొడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
అయితే, ‘భోళా శంకర్’ విషయంలో ఎందుకో లెక్క బెడిసి కొట్టింది. లీస్ట్ కలెక్షన్లు రాబట్టింది ఓపెనింగ్స్ ద్వారా ‘భోళా శంకర్’ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్.
అయితే, లాంగ్ వీకెండ్ కావడంతో ఓపెనింగ్స్ తేడా కొట్టినా తర్వాత పుంజుకునే అవకాశల్లేకపోలేదు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. అయితే, అది స్ట్రెయిట్ మూవీ కాబట్టి.. అందులో పెద్దగా తప్పులు వెతకలేదు.
‘భోళా శంకర్’ విషయానికి వచ్చేసరికి, నాలుగేళ్ల క్రితం రిలీజైన అజిత్ ‘వేదాళం’ సినిమా ఆల్రెడీ చాలా మంది చూసేయడంతో, అక్కడ తప్పుంది.. ఇక్కడ లేవలేకపోయింది... అంటూ తప్పులు వెతికే కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టారు. అదే ‘భోళా శంకర్’కి పెద్ద మైనస్ అయిపోయింది.
అయితే, మంచి ఉద్దేశ్యంతోనే చిరంజీవి ఈ సినిమా చేశారు. సో, మెల్ల మెల్లగా పుంజుకునే అవకాశాల్లేకపోలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com