విజయవాడలో సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న చేనేత ప్రదర్శన
- August 13, 2023
విజయవాడ: విజయవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్ధాయి చేనేత వస్త్ర ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. చేనేత సంస్కృతి సంప్రదాయాల ఆలంబనగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్ పో విజయవాడ వాసుల ఆదరణను చూరగొంటుండగా, సరికొత్త డిజైన్లతో రూపొందించిన చేనేత వస్త్రాలు స్టాళ్లలో అదరహో అనిపిస్తున్నాయి. పటమట యన్ టి ఆర్ సర్కిల్ సమీపంలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన శనివారం తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చీరాల, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి పట్టుచీరలతో పాటు, ఒకటా రెండా వందలాది డిజైన్లతో ప్రత్యేకించి యువతను ఆకర్షించే విధంగా రూపుదిద్దిన చేనేత వస్త్రాల ప్రదర్శన చిన్నా పెద్దా అందరినీ ఆకర్షిస్తుంది. చేనేత ఉత్పత్తులను నేటి యువతకు చేరువ చేసే లక్ష్యం దిశగా ఈ ప్రదర్శన సాగుతోంది.
చేనేత వస్త్రాలంటే వయోజనులకే అన్న నానుడికి ముగింపు పలుకుతూ, చేనేత ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన డిజైన్ల వస్త్ర శ్రేణి ఫలితంగా కోనుగోలు దారుల అందచందాలు రెట్టింపు అయ్యాయంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రదర్శన మునుపెన్నడూ చూడని ఆదరణను చూరగొంటుండగా, చేనేత వస్త్రాలు అందంతో పాటు హుందాతనాన్నిఇస్తాయని, ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా అనుకూలమైనవని నేతన్నలు వెల్లడిస్తున్నారు. ప్రత్యేక శ్రద్దతో చేనేత కళను ప్రోత్సహిస్తూ ఈ రంగాన్ని స్వయం సమృద్ది బాటలో నడిపించేలా తమకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం అందుతోందని తెలిపారు.
రాష్ట్ర చేనేత వస్ర్త శ్రేణికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించేలా కాలానుగుణ ఫ్యాషన్ల మేరకు నూతన వెరైటీలు అందుబాటులో ఉంచామని చేనేత శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్ అన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ లో ప్రత్యేక రాయితీలు అమలవుతున్నాయన్నారు. ప్రస్తుత మార్కెట్ పోకడలకు అనుగుణంగా చేనేత ఏజెన్సీలు, నేత కార్మికులు వినూత్న డిజైన్లతో తమ విభిన్న ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి ఒక వేదికను అందించటమే ధ్యేయంగా చేనేత ప్రదర్శనలను నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభాకర్ చేనేత సంఘాల ప్రతినిధులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. గుంటూరు సంయుక్త కలెక్టర్ రాజకుమారి, మంగళగిరి పురపాలక సంఘం కమీషనర్ శారద దేవి తదితరులు చేనేత ప్రదర్శనను సందర్శించారు. కార్యక్రమంలో అప్కొ జిఏంలు నాగేశ్వర రావు, తనూజా రాణి, కన్నబాబు, మార్కెటింగ్ అధికారి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్‌చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్‌కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్‌లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!







